పొన్నాల‌కు హ్యాండ్ ఇచ్చిన‌ట్లేనా ?

466

తెలంగాణ‌లో మ‌హాకూట‌మి సీట్ల చిచ్చు ఇప్పుడు రెబ‌ల్స్ తో స‌రికొత్త హీటు పెంచింది అనే చెప్పాలి.. సీనియ‌ర్ల‌కు సీట్ల విషయంలో టీపీసీసీ స్క్రీనింగ్ క‌మిటీకి కొంద‌రి పేర్లు సూచించ‌లేదు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి, పారాచూట్ అభ్య‌ర్దులు పెరిగిపోయారు అని వారికి మాత్ర‌మే టికెట్లు ఇచ్చారు అనే విమ‌ర్శ‌లు కూడా కాంగ్రెస్ లో అసంతృప్తులు చెబుతున్న మాట‌.

Image result for పొన్నాల లక్ష్మయ్యతాను జనగామ నుంచే పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. జనగామ నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ చేస్తారనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు… మహాకూటమి భాగస్వామ్య పక్షాల సీట్ల కేటాయింపులపై పూర్తిస్తాయి నిర్ణయం జరగలేదని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రకటించని స్థానాలన్ని మిత్రపక్షాలకు కేటాయిస్తారనుకోవడం పొరపాటేనని చెప్పారు. ఇంకా చాలా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇక ఆయ‌న పేరు లేక‌పోవ‌డంతో టికెట్ పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.