పెద‌కూర‌పాడు వైసీపీ ఇంచార్జ్ అవుట్

314

గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాజాగా ఇక్క‌డ ప‌లు సెగ్మెంట్ల‌లో వైసీపీ ఇంచార్జుల‌ను మారుస్తున్నారు జ‌గ‌న్… గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు ఇంచార్జ్ గా ఉన్నారు. కాని తాజాగా జ‌గన్ ఇక్క‌డ మ‌రో నేత, సెగ్మెంట్లో ఉన్న నాయ‌కుడు నంబూరి శంకరరావును పెదకూరపాడు వైసీపీ సమన్వయకర్తగా నియ‌మించారు.

Image result for కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు

దీంతో శంకర్‌రావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. క్రోసూరులో పార్టీ ఆఫీసు ఎదుట కిరోసిన్‌ డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. శంకరరావు ఫ్లెక్సీలను చించివేశారు. పెదకూరపాడు వైసీపీ సమన్వయకర్తగా కావటినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.మ‌రి ఆయ‌న పార్టీలో ఉంటారా లేదా బ‌య‌ట‌కు వెళ‌తారా అనే ఆలోచ‌న‌లో కూడా ఇక్క‌డ నేత‌లు ఉన్నారు.