పులివెందులలో టీడీపీ అభ్యర్ది ఫిక్స్

279

తెలుగుదేశం పార్టీ పులివెందులలో ఎప్పటి నుంచో గెలవాలి అని చూస్తోంది.. ఇక్కడ వైయస్ ఫ్యామిలీకి కంచుకోట, గతంలో వైయస్ ఆర్ గెలిస్తే ఇప్పుడు జగన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత సతీశ్రెడ్డిని పులివెందుల అసెంబ్లీ స్థానంలో జగన్పై పోటీకి నిలుపనుంది.

Image result for satish reddy pulivendula

కొద్దిరోజుల క్రితం కడప జిల్లా ముఖ్యులతో సమావేశమైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వాన్ని తెలియజేశారు. గత ఎన్నికల్లో కూడా ఆయనపై సతీశే పోటీచేశారు. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై కూడా సతీశ్ పోటీ చేయడం విశేషం. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి పులివెందులలో గత 20 ఏళ్లుగా ఆయనే టీడీపీ అభ్యర్థిగా తలపడుతున్నారు. మరి ఈసారి విజయం ఎవరి వశమవుతుందో చూడాలి.