పార్లమెంటు ఆవరణలో ఏపీ ఎంపీలు ధ‌ర్నా

318

ఇక ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం మ‌రింత తీవ్ర‌రూపం దాల్చుతుంది అని అనుకున్న స‌మ‌యంలో అన్ని పార్టీలు సైలెంట్ అయ్యాయి ఇకబీజేపీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేదు అని తేల్చేసింది. ఈ స‌మ‌యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

Image result for ycp mps

కాగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ముందు టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.మ‌రి ఏపీకి కేంద్రం ఈసారి అయినా ఏమైనా మంచి ప్ర‌క‌టన చేస్తుందేమో చూడాలి.