పార్టీలో చేరారు పవన్ ఎంపీ టికెట్ ఇచ్చారు.

171

ఇక ఎన్నికలకు కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నాలి ఎలాంటి రాజకీయ ఎత్తులు వేయాలి అనే అంశంలో ఫోకస్ చేశాయి. ముఖ్యంగా అభ్యర్దుల ప్రకటన విషయంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి అని చెప్పాలి. ఇక పవన్ కల్యాణ్ తాజాగా 32 మంది ఎమ్మెల్యే అభ్యర్దులు 9 మంది ఎంపీ అభ్యర్దులను ఫైనల్ చేశారు. తొలిజాబితాలో వీరి పేర్లు త్వరలో ప్రకటిస్తాం అని తెలియచేశారు

అలాగే అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రటించారు. అమలాపురం నుంచి ఓన్జీసీ మాజీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డీఎంఆర్ శేఖర్ పోటీ చేస్తుండగా, రాజమండ్రి నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బరిలో దిగుతున్నారు. డీఎంఆర్ శేఖర్ సోమవారమే పార్టీలో చేరారు.. ఆ వెంటనే ఆయనకు అమలాపురం పార్లమెంట్ స్థానానికి పవన్ ఎంపిక చేశారు.