పాకిస్ధాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి యుద్దం చేస్తాం పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్

52

పుల్వామాలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై పూర్తిస్థాయి యుద్ధం చేయాడానికి భారత సైన్యం సిద్ధపడిందా? ఈ మేరకు సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచారా? ఉన్నతస్థాయి సైనిక వర్గాలు దీనికి ఔనని సమాధానం చెబుతున్నాయి. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై మన వైమానిక దళం దాడి చేయడానికి ముందు ఆయన దీనిపై సర్కారుతో చర్చించినట్లు వివరించాయి.

Image result for pak


అలాగే పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ యుద్ధం చేయగలమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ ఏ చర్యలకు పాల్పడినా సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాదు.. ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వారి భరతం పడతామని, దాని కోసం ఆర్మీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారు. పదవీ విరమణ చేసిన సైనికాధికారులతో రావత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. పుల్వామా దాడి తర్వాత పాక్‌కు సరైన బుద్ధి చెప్పేందుకు తాము రెడీ అయ్యాం. స్వల్పకాలిక, తీవ్రస్థాయి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. బాలాకోట్ వైమానిక దాడులు కాకుండా, ఆర్మీ సైనికులకు ఆ బాధ్యత అప్పజెప్పినా ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వారి భరతం పట్టేవాళ్లం అని తెలిపారు. బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టగలమా? అని కేంద్ర ప్రభుత్వం అడిగిందని.. ఏ పరిస్థితుల్లోనైనా సరే, వీలైతే ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి దాడి చేయగల సామర్థ్యం మన ఆర్మీకి ఉందని రావత్ ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు తాజాగా తెలుస్తోంది.

Related image

పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సైనికాధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఉరి ఉగ్ర దాడుల్లో సైనికుల మరణాలకు ప్రధాన కారణం.. సరైన ఆయుధాలు లేకపోవడమే అని గుర్తించాం. దానిపై సమీక్షలు జరిపి ఆయుధాల కొనుగోళ్లు ప్రారంభించాం. ప్రస్తుతం రూ.11వేల కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేశామని, అందులో 95 శాతం సైన్యానికి చేరాయని తెలిపారు. రూ.7వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లు ఫైనలైజ్ అయ్యాయని, మరో రూ9.వేల కోట్ల ఆయుధాల కొనుగోళ్లపై చర్చలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాక్‌ను తగురీతిలో శిక్షించేందుకు వైమానిక దాడులు సహా పలు మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది. ఆ సమయంలో రావత్‌ తన బలగం సన్నద్ధత గురించి ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారు. పదవీ విరమణ పొందుతున్న పలువురు సైనికాధికారులతో సోమవారం రహస్యంగా సమావేశమైనప్పుడు ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం సంప్రదాయ పద్ధతిలో భూతల యుద్ధానికి సిద్ధమని రావత్‌ నాడు ప్రభుత్వానికి స్పష్టంచేశారు.