పాకిస్ధాన్ ప్రధాని ఇమ్రాన్‌ కు ట్రంప్ వార్నింగ్ రెచ్చగొట్టొద్దు

57

జమ్మూకశ్మీర్‌ అంశం ఆర్టికల్ 370 రద్దుతో , పాకిస్ధాన్ మాత్రం ఈ విషయాన్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకువచ్చింది. భారత్ ని ఏకాకిని చేద్దామనుకున్న పాకిస్ధాన్ తానే ఏకాకి అయిపోయింది.జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులకు సంబంధించి భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు సూచించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారంనాడు ట్రంప్‌తో దాదాపు అరగంటపాటు జరిపిన టెలిఫోన్‌ సంభాషణలో ఇమాన్ర్‌ దుందుడుకు వ్యాఖ్యలపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మోదీతో మాట్లాడిన తర్వాత ట్రంప్‌ ఇమ్రాన్‌ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరంపై భారత్‌తో చర్చలు జరపాలని, దూకుడు తగ్గించుకోవాలని ఇమ్రాన్‌కు ట్రంప్‌ సూచించినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

Image result for modi and imran khan

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ట్రంప్‌ నొక్కిచెప్పారని.. నియంత్రణ పాటించాల్సిందిగా ఇరువర్గాలకూ సూచించారని వెల్లడించాయి. అమెరికా-పాకిస్థాన్‌ మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార బలోపేతంపైనా ఇద్దరు నేతలూ చర్చించినట్టు వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే.. భారత్‌, పాక్‌ నడుమ ఉదిక్త్రతలను తగ్గించుకోవాల్సిన అవసరం గురించి, శాంతిని కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి ట్రంప్‌.. భారత ప్రధాని మోదీకి కూడా తెలిపారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ హోగన్‌ గిడ్లే వెల్లడించారు. మోదీ, ట్రంప్‌ త్వరలోనే భేటీ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు… మోదీ, ఇమ్రాన్‌తో ఫోన్‌ సంభాషణ జరిపిన విషయాన్ని ట్రంప్‌ కూడా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇమ్రాన్‌తో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడటం వారంలో ఇది రెండోసారి.

ఈ క్రింద వీడియో చూడండి

కశ్మీర్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో భారతదేశం చైనాతో జాగ్రత్తగా ఉండాలని జపాన్‌కు చెందిన వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సటోరు నగావో సూచించారు. కశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్న ఆయన.. అఫ్గానిస్థాన్‌లో అమెరికా తన సేనలను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో.. ఉగ్రవాదులు కశ్మీర్‌పై దృష్టి సారించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా సైనికులు అఫ్గానిస్థాన్‌ నుంచి వెళ్లిపోతే అక్కడి ఉగ్రవాదులంతా కశ్మీర్‌లోకి చొరబడతారని.. కాబట్టి భారత ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని నగావో అభిప్రాయపడ్డారు. లద్దా ఖ్‌ సరిహద్దులను చైనా నుంచి కాపాడుకోవడానికి.. ఆ ప్రాంతంపై భారత్‌ ప్రత్యేక, ప్రత్యక్ష నియంత్రణ ఉంచడం మంచిదేనన్నారు.