పవన్ పెళ్ళాలు ఆయన వ్యక్తిగతం…జగన్ కు షాకిచ్చిన ఉండవల్లి

617

తాజాగా పవన్ మూడు పెళ్ళిళ్ళ గురించి వైసిపి అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి..ఈ విషయమై మాజీ ఎంపి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు..రాష్ట్రంలో నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం ఇరు పార్టీలకు మంచిది కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్‌పై జగన్‌ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారన్నది తాను చూడలేదన్నారు. పత్రికల్లో వచ్చిన దాని బట్టి అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు…

పవన్ కు ఎంతమంది భార్యలు అనేది ఆయన వ్యక్తిగత విషయమని, ఆ వ్యవహారం ఆయన భార్యలే తేల్చుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసారు ఉండవల్లి..వ్యక్తి అలవాట్లు చూసి ఓట్లు వేయరని…. ఆ వ్యక్తి వల్ల ఎంత వరకు మేలనే విషయం చూసి ఓట్లు వేస్తారన్నారు.

తాను ఒక నేతను కలవడం అంటే మరో నేతకు దూరం కాదన్నారు. తన తల్లి చనిపోయినప్పుడు జగన్‌ కూడా వచ్చి పలకరించారన్నారు. పవన్ కల్యాణ్ పిలిస్తే వెళ్లానని…. చంద్రబాబు పిలిస్తే కూడా వెళ్లానని చెప్పారు. ఎవరు పిలిచినా వెళ్తానన్నారు.