పవన్ కు ఎస్పీవై రెడ్డి కుటుంబం షాక్

269

ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయడం తెలిసిందే.. అయితే పోటీలో వారు చివరి వరకూ ఉంటారా ఉండరా అనేది నామినేషన్ల ఉపసంహరణ రోజు తెలుస్తుంది. తాజాగా జనసేన పార్టీ కి పొలిటికల్ గా కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు ఉపసంహరించుకునే యోచనలో ఉన్నారు అనే వార్త ఆ పార్టీపై ఎఫెక్ట్ చూపిస్తుంది అని తెలుస్తోంది…జనసేనకు ఆ పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవైరెడ్డి ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ తరుపున ఆయన కుటుంబం వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Image result for ఎస్పీవై రెడ్డి

తెలుగుదేశంలో ఆయనకు టికెట్ నిరాకరించడంతో జనసేనలో చేరారు. జనసేన అనూహ్యంగా ఎస్వీవైరెడ్డి కుటుంబానికి ఏకంగా మూడు టికెట్లిచ్చింది. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగగా.. ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు వారికిఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చెప్పారు అయితే ఈ హామీకి ఎస్పీవై రెడ్డి కుటుంబం ఆలోచిస్తోందని మరోసారి యూ టర్న్ తీసుకుంటుంది అని అంటున్నారు. మరి నామినేషన్లు ఉపసంహకరించుకుంటారా లేదా అనేది చూడాలి