పవన్ కళ్యాణ్ ఫై పోటీ స్థానంపై క్లారిటీ

83

వచ్చే నెలలో జరిగే ఎన్నికల కోసం యావత్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు సమాయత్తం అయ్యాయి మరోసారి మోదీకా లేదా రాహుల్ గా లేదా ఫ్రంట్ వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి.. అయితే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కూడా ఇప్పుడు ఏపీలో సరికొత్త రాజకీయాలు చేస్తోంది అని చెప్పాలి. తెలుగుదేశం వైసీపీకి జనసేన మంచి పోటీ ఇస్తోంది. అయితే అభ్యర్దులను ఫైనల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తను పోటీ చేసే సెగ్మెంట్ విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నారట.

Image result for pawan kalyan janasena

విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా విశాఖ ఉత్తరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారని తెలుస్తుండగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుండడంతో జిల్లా వాసుల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. అయితే తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి జనసేన నుంచి హేమాహేమీలు విశాఖ నుంచి పోటీకి సిద్దంగా ఉన్నారు.