పంచాయతీ ఎన్నికల్లో నటుడు సునీల్ ప్రచారం

234

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.. ఇక ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పోరులో అభ్యర్దులు పార్టీలు లేకపోయినా వారికి కేటాయించిన గుర్తులతో స్పీడుగా ప్రచారాలు చేస్తున్నారు…సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతోపాటు సినీ నటులు కూడా గ్రామాలకు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లిలో సినీ నటుడు సునీల్ ప్రచారం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తన అభిమాని అయిన అభ్యర్థి కోసం ఆయన రంగంలోకి వచ్చారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు కూడా. ఎమ్మెల్యేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్టీ కార్యకర్తలను వెంట పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇలా పంచాయతీ ఎన్నికల్లో కూడా సినిమా నటులని ప్రచారంలోకి తీసుకురావడం చూస్తుంటే ,అసెంబ్లీ పార్లమెంట్ల ఎన్నికలను పంచాయతీ ఎన్నికలు దాటేలా పోటీ వాతావరణం అభ్యర్దుల మధ్య ఉంది అంటున్నారు విశ్లేషకులు.