నెహ్రూ బీఫ్ తినేవారు…బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

466

భారత మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎద్దు పంది మాంసం తినేవారని రాజస్తాన్ బిజెపి ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు..అసలు ఆయన పండిట్ ఎలా అవుతారని ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి..స్థానిక అల్వార్ ఎమ్మెల్యే క్వార్టర్ లను పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా నెహ్రూపై మండిపడ్డారు. గొడ్డు – పందిమాసం తిరేవారిని పండిట్ అని ఎలా పిలుస్తారని మండిపడ్డారు. ఓట్లు – మైలేజ్ కోసమే కాంగ్రెస్ నేతలు నెహ్రూ ముందు పండిట్ అని పేరు పెట్టారని ఎద్దేవా చేశారు…

కాగా అహుజా మొదటి నుంచి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు…గతంలో గోవును చంపితే ఉగ్రవాదం కన్నా నేరమని ఆయన తీవ్ర పదజాలం వాడారు…హిందూ బాలికలను లవ్ జీహాద్ పేరిట బలవంతంగా ముస్లింలుగా మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ఢిల్లీలో జరిగే లైంగిక దాడులకు 50శాతం బాధ్యత జేఎన్టీయూ విద్యార్థులదే అని వ్యాఖ్యానించి దుమారం రేపారు. తాజాగా నెహ్రూపై నోరు పారేసుకున్నారు. దీనిపై రాజస్థాన్ పీసీసీ ప్రెసిడెంట్ సచిన్ పైలెట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహూజాకు మతి చెడిదంటూ మండిపడ్డారు.