నిరుద్యోగులకు ఏపీ స‌ర్కారు మ‌రో ఆఫ‌ర్

24

ఏపీలో స‌ర్కారు ఇప్ప‌టికే నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతి అందిస్తోంది… వెయ్యిరూపాయ‌లు ప్ర‌తీ నెలా నిరుద్యోగుల‌కు అందిస్తోంది. ఇక ఈ స‌మ‌యంలో నిరుద్యోగ భృతి పొందుతున్న వారికి ఏపీ సర్కార్ మరో వరం ప్రకటించింది.. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు… మీడియాతో మంత్రి కొల్లు ఈ విష‌యాన్ని తెలియ‌చేశారు.. ముఖ్యమంత్రి యువ నేస్తం పధకం కింద 4 లక్షలకు పైగా అర్హులకు ప్రతీ నెల రూ.1000 భృతి ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Image result for నిరుద్యోగ భృతి

దాదాపు ఈ పధకానికి 10 లక్షల 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని చెప్పారు. దీని కోసం రూ.24 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఇష్టం ఉన్న వాటిలోనే కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. మ‌రి ఆ పోర్ట‌ల్ లో నిరుద్యోగులు మీ వివరాలు నింపి ఈ అవ‌కాశం సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సంపాదించండి.