నాగార్జునకు ప్రధాని మోదీ ట్వీట్

178

ఎన్నికల సమయం వచ్చింది ఇక సెలెబ్రీటీలకు కూడా ఇప్పుడు పని ఉంటుంది ..ఎందుకు అంటే రాజకీయ పార్టీలకు వారు సపోర్ట్ చేస్తే, వారి పార్టీలకు ప్రచారం చేయాలి క్యాంపెయినింగ్ స్టార్లగా వీరు సెలక్ట్ అవుతారు.. అందుకే ఇప్పుడు దేశంలో అందరు సినీ ప్రముఖులకు బీజీ షెడ్యూల్ ఉంటుంది. ఈ సమయంలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో.. తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను చైతన్య పర్చాలంటూ ఆయనకు మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా ఓటు హక్కు వినియోగంలో వెనుక బడిన ఓటర్లను చైతన్య పర్చలాంటూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు మోదీ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కింగ్ నాగార్జునకు ట్వీట్ పెట్టారు మోడీ.

Image result for నాగార్జునకు ప్రధాని మోదీ ట్వీట్

గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాల ద్వారా లక్షల మంది ఆధారాభిమానాలు సంపాదించారు. అలాగే పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. చాలా ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న మీరు.. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక నాగార్జు కూడా తన వంతుగా ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా, ప్రజలను చైతన్య వంతం చేస్తాను అని అన్నారట.