నాకు కోట్ల కుటుంబం గురించి తెలియదు- కేఈ

272

కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీ టీడీపీ ఎంట్రీ , తెలుగుదేశంలోకాస్త అలజడి సృష్టిస్తోంది.. కోట్ల కుటుంబం తెలుగుదేశంలో చేరడాన్ని కేఈ కృష్ణమూర్తి వ్యతిరేకిస్తున్నారు.. అయితే ఎన్నో దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది ఈ రెండు కుటుంబాల మధ్య.. నేడు ఎన్నికల సమయంలో ఇద్దరూ ఎలా కలిసి పనిచేస్తారు అనేది చూడాలి అనేది అందరూ చర్చించుకుంటున్న అంశం. అయితే నేడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించలేదని తెలిపారు కేఈ.

Image result for కోట్ల

 

కేవలం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపైనే చర్చించామన్నారు. సీఎం అడిగినప్పుడే కోట్ల విషయంపై తన అభిప్రాయం చెబుతానని చెప్పారు. కోట్ల కుటుంబం ఏం సీట్లు అడుగుతున్నారో తనకు తెలియదని కేఈ కృష్ణమూర్తి అన్నారు. మొత్తానికి మీడియాలో ఇన్ని వార్తలు వస్తున్నా టీడీపీలో సీనియర్ లీడర్ కేఈ ఇలా అనడం పై అందరూ కొత్త ఆలోచనలు ఆలోచిస్తున్నారు.