నాకు ఏమీ వద్దు – ఎమ్మెల్యే టికెట్ కావాలి ఆకేపాటి

432

రాజంపేట ఎమ్మెల్యే టికెట్ తనకు కావాలి అని, తనకు మరే పదవి అక్కర్లేదు అని అంటున్నారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి..సోమవారం గొల్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో ఆకేపాటి అనుచరులు పలువురు మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉంటూ తమ కార్యకర్తల్లో మనో ధైర్యం నింపుతూ పార్టీని ముందుకు నడిపించిన ఘనత ఆకేపాటి అమర్నాథ్రెడ్డిదేనన్నారు.

Image result for ఆకేపాటి అమరనాధరెడ్డి

కొత్తగా పార్టీలోకి చేరుతున్న మేడా మల్లికార్జునరెడ్డికి టికెట్టు ఇస్తే తాము ఎటువంటి పరిస్థితుల్లో సహకరించమన్నారు.ఈ సమయంలో పార్టీలో నాలుగు సంవత్సరాలుగా కష్టపడి ఇంతకాలం ఇక్కడ నడిపిన అమర్నాథ్ రెడ్డికి ,టికెట్ ఇవ్వకుండా పార్టీలో చేరిన మేడా కుటుంబానికి టికెట్ ఇస్తే, ఇక్కడ పార్టీ కేడర్ ప్రజలు సహకరించరు అని, ఇలాంటి నిర్ణయం జగన్ తీసుకోరు అని, తాము అనుకుంటున్నట్టు అక్కడ కేడర్ తెలియచేశారు.