దూకుడు చూపుతున్న ఏపీ మంత్రి

205

తండ్రిని మావోయిస్టులు చంపెయ్యడంతో సీఎం చంద్రబాబు ఆ కుటుంబానికి అండగా ఉన్నారు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతితో మంత్రిగా కిడారి కుమారుడు శ్రవణ్ ని మంత్రిని చేశారు..ఇక మంత్రి గా అయిన తర్వాత ఆయన తన పని తీరుతో అధికారులు నాయకుల మన్ననలు పొందుతున్నారు.. ముఖ్యంగా అరకు ప్రాంతంలో తమ వారికి అందరికి ఆయన దగ్గర అవుతున్నారు.. మంత్రిగా ఇప్పటికే మంచి పేరు కొద్దికాలంలోనే తెచ్చుకున్నారు.

Image result for శ్రవణ్ ని మంత్రి

ఇక ఎన్నికల వేళ ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం తధ్యం , దీంతో ఆయన కూడా రాజకీయ విమర్శలు మొదలుపెట్టారు…బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి కిడారి శ్రవణ్ స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి కిడారి శ్రవణ్ ఆదేశించారు.