థ్యాంక్స్ చెప్పిన రాహుల్ ఎందుకంటే?

401

దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌వ‌నాలు వ‌స్తున్నాయి అనే చెప్పాలి.తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది.కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబెట్టిన రాజస్థాన్ ప్రజలకు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చుతామని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉపముఖమంత్రిగా సచిన్ పైలట్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

Image result for rahul gandhi

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచిన రాజస్థాన్ ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు. రాజస్థాన్‌కు సేవలు అందించడం కాంగ్రెస్ పార్టీ గౌరవంగా భావిస్తోంది. మా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చుతాం…అని పేర్కొన్నారు. మొత్తానికి రాహుల్ తో కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వ‌స్తుందా లేదా అనేది వేచి చూడాలి.