త‌న స‌పోర్ట్ ఎవ‌రికో చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్

391

తెలంగాణ‌లో ఏ పార్టీకి జ‌న‌సేన స‌పోర్ట్ ఉంది, ఏ పార్టీకి జ‌నసేనాధినేత స‌పోర్ట్ ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నారు.. అస‌లు స‌పోర్ట్ చేస్తారా లేదా ఇదే గ‌త కొద్దినెల‌లుగా తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు అయిన త‌ర్వాత చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశం. అయితే నిన్న ప‌వ‌న్ క‌ల్యాన్ తెలియ‌చేశారు తెలంగాణ‌లో తాము ఏ పార్టీకి స‌పోర్ట్ చేస్తాము అనేది చెపుతాను నేడు అని.

Image result for pawan kalayan

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం..తక్కువ సమయం ఉండటం వల్లే జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ యువత ఈరోజు తెలంగాణను తెచ్చుగోగలిగిందని ఆయన అన్నారు. తెలంగాణను ఇచ్చామని ఒకరు..తెలంగాణను తెచ్చామని మరొకరు..చెబుతున్నారని..ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి ఓటేయాలనే స్థితిలో ఉన్నారన్నారు. ఎవరైతే ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో పాలన అందించగలరో ప్రజలందరూ ఆలోచించి వారికే ఓటేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అభిమానులకు జనసేన కార్యకర్తలకు సూచించారు.