తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ

385

ఏపీ తెలంగాణో ఎప్పుడు అసెంబ్లీ స్ధానాలు పెరుగుతాయి అని రాజ‌కీయ పార్టీలు ఎదురుచూశాయి.. అయితే ఇప్పుడు ఈసీన్ మారింది అనే చెప్పాలి తెలంగాణలో, ఎందుకు అంటే ఇక్క‌డ ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి.. దీంతో ఎవ‌రికి వారు ఈ అసెంబ్లీ సీట్ల పెంపు గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక ఇప్పుడు దీనిపై కేంద్రం మ‌రో సారి క్లారిటీ ఇచ్చింది.

Image result for ap assembly

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగారాం ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే.. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ఉంటుందని ఆయన అన్నారు. అలాగే విభజన చట్టం 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలన్నీ ఏపీకి అమలు చేశామని.. టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు గంగారాం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.