తెలంగాణ లో కేసిఆర్ కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ సంతోషంగా లేరు…కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు…

563

తెలంగాణ రాష్ట్రంలో అధికార టి ఆర్ ఎస్ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది..నిన్న నిజామాబాద్ లో మంత్రి కేటిఆర్ కాంగ్రెస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసారు..కాంగ్రెస్ లో జానా రెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డిలు తప్ప మిగతా వారందరూ తమ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని అయితే తమ పార్టీలో జాగా లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు..ఇదిలా ఉండగా తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి తెలంగాణ కాంగ్రెస్ లో ప్రముఖ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి కేసిఆర్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు..తెలంగాణా వచ్చిన ఆనందం కేసిఆర్ కుటుంబ సభ్యుల్లో తప్ప మరేవరిలోనూ లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు..తెలంగాణ లో కేసిఆర్ కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ సంతోషంగా లేరని చురక అంటించారు…

శ్రీవారి దయతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంవృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానాన్ని పూర్తిగా మద్దతు పలికారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆయన..విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తమ పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏపీకి హోదా ఇవ్వాలంటూ ఎంపీ కవిత కూడా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మినహా మిగిలిన మంత్రులు ఎవరికీ అధికారాలు లేవని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ది కాగితాల మీదనే తప్ప వాస్తవంగా లేదన్నారు. తన మాటలతో తరచూ కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు సంధించే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన విమర్శలు తెలంగాణ సీఎంకు మరింత మంట పుట్టేలా ఉన్నాయని చెప్పక తప్పదు.