తెలంగాణ గవర్నర్ గురించి షాకింగ్ నిజాలు

1087

ఇటీవల కేంద్రప్రభుత్వం 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి భాజపా మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ గవర్నర్​గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.నేడు ఆమె తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో …ఆమెతో తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. అంతకు ముందు బేగంపేట ఎయిర్ పోర్టులో సౌందర్‌రాజన్‌కు… ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఇప్పటి వరకు తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేయడానికి ముందు బీజేపీ జాతీయ కార్యదర్శిగా సైతం ఆమె పనిచేశారు.

Image result for తమిళిసై సౌందరరాజన్

పొలిటికల్ ఫ్రొఫైల్ చూస్తే

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా గతంలో ఆమె పనిచేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు.తమిళిసై సౌందరరాజన్‌…. వృత్తిరీత్యా డాక్టర్‌. 1961 జూన్‌ 2న కన్యాకుమారి జిల్లాలో సౌందరరాజన్‌ జన్మించారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ చెన్నై నుంచి ఎంబీబీఎస్​ పట్టా అందుకున్నారు. రామచంద్ర మెడికల్‌ కళాశాలలో సహాయక ఆచార్యురాలిగా పనిచేశారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో చదివేప్పుడు విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. తమిళిసై భర్త కూడా వైద్యుడే. భారత వైద్య పరిశోధనా మండలిలో పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు.చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పలు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవారు ఆమె తండ్రి కాంగ్రెస్… కుమార్తె బీజేపీ ..తండ్రి కుమారి ఆనందన్‌ ఎంపీగా పనిచేయడం వల్ల… బాల్యం నుంచే తమిళిసై సౌందరరాజన్‌కు రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. తండ్రి కాంగ్రెస్‌లో పనిచేసినప్పటికీ…. సౌందరరాజన్‌ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సమయంలో బీజేపీ వైపు ఆకర్షితురాలయ్యారు.

ఈ క్రింద వీడియో చూడండి

తమిళనాడు బీజేపీ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే తమిళిసై సౌందరరాజన్‌ 2006, 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009, 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆరుసార్లు ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు… ట్యూటికొరిన్ నియోజకవర్గంలో డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి కుమార్తె కనిమోళిపై పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. బీజేపీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఉండటం ఆమెకు కలిసొచ్చింది.వివిధ హోదాల్లో బాధ్యతలు..తమిళిసై 1999లో దక్షిణ చైన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ (మెడికల్ వింగ్ ఫర్ సదరన్ స్టేట్స్)గా, 2007లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను కేంద్రం తెలంగాణ గవర్నర్​గా నియమించింది. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళ గవర్నర్​గా ఖ్యాతిగడించారు.