తెలంగాణ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్దుల విష‌యంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాలు

396

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆది నుంచీ ఆసక్తికరంగా మారాయి… ఇక డిసెంబ‌రు 07న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి..11 న ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు ప్ర‌జ‌లు. ముందస్తు ముచ్చట మొదలు ఆద్యంతం అనేక పరిణామాలు నేటి వ‌ర‌కూ ఉత్కంఠ రేపాయి. తాజాగా ఎలక్షన్‌ వాచ్‌ సంస్థ అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా మరిన్ని విశేషాలు వెల్లడయ్యాయి. మ‌రి ఆ విష‌యాలు తెలుసుకుందాం. మొత్తం 119 స్థానాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో నిలవగా… 1777 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఈ సంస్థ విశ్లేషించింది. ధనికులు, పేదలు, ఆదాయం, అప్పులు, విద్యావంతులు, మహిళలు, యువత… ఇలా విభిన్న అంశాలపై సంస్థ వెల్లడించిన రిపోర్టు చూస్తే మ‌న‌కు కాస్త ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.

Image result for kcr
ధనికులు
నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధనవంతుల జాబితాలో టాప్‌లో నిలిచారు. ఈయన అఫిడవిట్‌లో రూ.266.86 కోట్ల చరాస్తులు, రూ.47.45 కోట్ల స్థిరాస్తులు చూపారు. మొత్తంగా ఆయనతో పాటు కుటుంబసభ్యుల పేరుతో ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.314 కోట్లకు పైమాటే. ఇక బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్‌ స్థిర, చరాస్తులు రూ.182.66 కోట్లతో రెండో స్థానంలో, నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి రూ.161.29 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు.

Image result for kcr meeting

పేదలు
నిజామాబాద్‌ అర్బన్‌ స్వతంత్ర అభ్యర్థి బల్ల శ్రీనివాస్‌ కేవలం రూ.15 ఆస్తి చూపి అత్యంత నిరుపేదగా నిలిచారు. కోరుట్ల స్వతంత్ర అభ్యర్థి జగిలం రమేష్‌ రూ.500, పెద్దపల్లి సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డి రూ.500 ఆస్తులు చూపారు. సున్న ఆస్తులున్నవని ప్రకటించినవారు 58 మంది ఉండడం విశేషం.

Related image

అప్పులు
బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్‌ రూ.144 కోట్లు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణంగా పొందినట్లు అఫిడవిట్‌లో చూపి, అప్పులున్న అభ్యర్థుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఆస్తులు రూ.91 కోట్లు కాగా.. అప్పులు రూ.94కోట్లుగా పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అప్పులు రూ.63 కోట్లు. మ‌రి చూశారుగా ఇలా పోటికి నిలుచున్న వారి జాబితా ఉంది ప‌లు అంశాల‌లో.