తెలంగాణ ఎన్నికలపై లగడపాటి లడాయి

294

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి.. అలాగే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది గులాబీ పార్టీ.. ఇక ఈ సమయంలో లగడపాటి సర్వే పూర్తి డిఫరెంట్ గా చెప్పి మరింత వార్తల్లో నిలిచారు…మహాకూటమి అధికారంలోకి వస్తుంది అని తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుంది అన్నారు కాని చివరకు కారు పార్టీ గెలిచింది.

Image result for lagadapati
ఇక తాజాగా తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిపెట్టాలన్నారు. వీవీ ప్యాట్లు ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ యుగంలో గంటలో చెప్పాల్సిన పోలింగ్ శాతానికి.. రెండు రోజుల సమయం ఎందుకు తీసుకున్నారన్నారు. సాయంత్రం ఐదు తర్వాత పోలింగ్ శాంత ఎంత మేర పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విపక్షం పుంజుకుందన్నారు. ఇలా నెలరోజుల్లోనే డిఫరెన్స్ కనిపిస్తోంది అని ఆయన అన్నారు.