తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పెంచిన పార్టీలు ప్ర‌చారాల షెడ్యూల్ ఇదే

369

తెలంగాణ రాజకీయం మ‌రింత హీట్ అయింది అనే చెప్పాలి, రాజ‌కీయంగా టీఆర్ ఎస్ – కాంగ్రెస్ మహాకూట‌మితో బీజేపీ లెఫ్ట్ పార్టీలు క‌లిసి రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు మొద‌లుపెట్టాయి.. ఇప్ప‌టికే నామినేష‌న్ ప‌నిలో నేత‌లు బిజి బిజిగా ఉన్నారు. మ‌రో వైపు కూట‌మి నుంచి నేత‌లు ఒక్కొక్క‌రుగా టిక్కెట్లు పొందుతున్నారు.ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలివి..

Image result for trs pracharam
నవంబర్ 19- ఖమ్మం, పాలేరు, పాలకుర్తి
20వ తేదీ- సిద్దిపేట, దుబ్బాక, హుజూరాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డి
21వ తేదీ- జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్
22వ తేదీ- ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముథోల్, ఆర్మూర్
23వ తేదీ- నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ
25వ తేదీ- తాండూర్, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం

Image result for trs pracharamటీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా ఉండగా.. బీజేపీ తరపున కూడా ఎన్నికల ప్రచారానికి హేమాహేమీలు తెలంగాణకు రానున్నారు. నవంబర్ 25, 27, 28వ తేదీల్లో తెలంగాణలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున మొత్తం 12 నియోజకవర్గాల్లో అమిత్‌షా పర్యటన సాగనుంది. డిసెంబర్ మొదటి వారంలో మోదీ పర్యటించనున్నారు. 3 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రేపటితో సీట్ల జాబితా తేల్చనుంది.
తెలంగాణ‌లో ఈ నెల 23 తర్వాత బహిరంగ సభల్లో సోనియాగాంధీ పాల్గొననున్నారు. డిసెంబర్ మొదటివారంలో 2రోజుల పాటు రాహుల్ ప్రచారం సాగనుంది. పలు బహిరంగ సభలు, రోడ్ ‌షోల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. మొత్తానికి తెలంగాణ‌లో రాజ‌కీయం స‌రికొత్త ప్ర‌చారాల‌తో హోరెత్త‌నుంది అనే చెప్పాలి.