తెలంగాణ‌లో పవన్‌ ప్రచారం

405

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపు అందుకుంది అనే చెప్పాలి.. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం తెలంగాణ‌లో కూడా చేయ‌నున్నారు.. అయితే జ‌న‌సేన పోటీ చేయ‌డం లేదు క‌దా మ‌రి ఎందుకు అనే ఆలోచ‌న మీకు వ‌చ్చి ఉంటుంది. ఇక్క‌డ ఆయ‌న ప్ర‌చారానికి వ‌చ్చేది బీఎల్ ఎఫ్ పార్టీ కోసం.

Image result for pawan kalyan telangana meeting
బహుజన లెఫ్ట్‌ ప్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థుల తరపున జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దించేందుకు ఇక్కడి ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని కోసం స్థల సేకరణ, జన సమీకరణలాంటి అంశాలపై పార్టీ అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. సినీ నటుడుగా పవన్‌ కల్యాణ్‌కు యువకులు, మహిళల్లో మంచి ఇమేజ్‌ ఉన్నందున ఆ రెండు వర్గాల ఓట్లను కూడగట్టవచ్చని బీఎల్‌ఎఫ్‌ భావిస్తోంది. రెండు మూడు స‌భ‌ల్లో ప‌వ‌న్ పాల్గొంటారు అని తెలుస్తోంది మ‌రి చూడాలి తెలంగాణ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ చ‌రిష్మా ఎలా ఉండ‌బోతోందో.