తెలంగాణ‌లో నిశ్శ‌బ్దం మూగ‌బోయిన మైకులు

422

తెలంగాణ ఎన్నిక‌ల‌కు ఇక మ‌రో 36 గంట‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది ఇక ప్ర‌చారానికి ఈరోజు ఐదుగంట‌ల‌తో స‌మ‌యం ముగిసింది. రెండు నెలలకు పైగా నేతల ప్రచార హోరుతో వేడెక్కిన తెలంగాణ.. ఎన్నికల ప్రచారం ముగియడంతో కొద్దిసేప‌టి క్రితం మైకులు మూగబోయాయి. 119 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2 కోట్ల 80 లక్షల, 64 వేల ఓటర్లు తమ తీర్పుతో తేల్చనున్నారు. సంక్షేమ పథకాలు తమ అభివృద్ధే నినాదంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బరిలోకి దిగగా.. కేసీఆర్‌ను గద్దే దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి ప్రచారం సాగించింది. గులాభి అధినేత కేసీఆర్‌ గజ్వేల్‌లోనే ప్రచారం ప్రాంభించి అక్కడే ముగించగా.. మహాకూటమి ఆలంపూర్‌లో ప్రారంభించి.. కోదాడ బహిరంగ సభతో ముగించింది.

Image result for trs and congress logo
ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఇక ఇలాంటివి ఎక్క‌డైనా జ‌రిగినా పోలీసుల‌కు ఎన్నిక‌ల అధికారుల‌కు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పారు ఉన్న‌తాధికారులు.