తెలంగాణ‌లో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై కేసు ఎందుకంటే ?

408

తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక విష‌యాలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి… ప్ర‌చారాలు, నామినేష‌న్లు, ఉప‌సంహ‌ర‌ణ ఇలా ఒక్కొక్క అంశం ప్ర‌జ‌ల్లో ప‌లు ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌ల‌కు తావిస్తోంది.. తాజాగా ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థికి కొత్త తలనొప్పి వచ్చింది. మహాకూటమి సీట్ల పంపకంలో భాగంగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డిపై 420, 468, 471 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాదాపూర్‌లో రూ.కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ సంతకాలతో కాజేసినట్టు ఆయనపై ఫిర్యాదు చేశారు. నాంపల్లి సబ్‌రిజిస్టర్ ఆఫీసులో ఫోర్జరీ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related image

ప్రజాకూటమిలో భాగంగా మొత్తం 13 స్థానాల నుంచి టీడీపీ పోటీలో ఉందని, ఇబ్రహీంపట్నం బరిలో ఉన్నది తామేనని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ స్పష్టం చేశారు. బీఎస్పీ తరఫున ఇబ్రహీంపట్నం బరిలో ఉన్న కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డికి ప్రజాకూటమితో సంబంధం లేదన్నారు. పొత్తు ధర్మం పాటించి మల్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేయాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరానని చెప్పారు. మల్‌రెడ్డి విషయంలో ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి గురువారం ఉదయం రమణకు ఓ లేఖ రాశారు. మ‌రి వీరి ఇద్ద‌రి విష‌యంలో ప్ర‌జ‌లు తీర్పు ఎలా ఇస్తారో చూడాలి అలాగే టీఆర్ఎస్ కూడా ఇక్క‌డ గ‌ట్టిపోటి ఇస్తుంద‌ని అంటున్నారు కారు పార్టీ నేత‌లు.