తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ 7లేదా10

287

తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పడింది కాని ఇంకా ఇక్కడ మంత్రి వర్గం ఏర్పాటు కాలేదు.. దీంతో తెలంగాణలో ఇదే విషయం చర్చకు వస్తోంది..కేబినెట్ విస్తరణపై కొత్త అంచనాలు వస్తున్నాయి. ఇక కేసీఆర్ జాతకాలు సంఖ్యా శాస్త్రాలు నమ్ముతారు కాబట్టి, ఇలాంటి ఆలోచన మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.సంఖ్యాశాస్త్రం ప్రకారం 10 మంది ఉంటారట, అలాగే ఇక ముహూర్తం తేలాలి అని చెబుతున్నారు.

Image result for kcr

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న జాప్యంపై చాలామంది ఆశావహుల సన్నిహితుల్లో చర్చ అసహనం దిశగా సాగుతోంది. కేబినెట్ విస్తరణ ఇంకెప్పుడు చేస్తారు? ఇక మంత్రివర్గాన్ని విస్తరించనే విస్తరించరా? లోక్సభ ఎన్నికలయ్యే వరకు సాగదీస్తారా? బడ్జెట్ సమావేశాల ముందు కూడా కేబినెట్ విస్తరణ చేపట్టరా? అనే సందేహాలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయని, 7న లేదా 10వ తేదీన కేబినెట్ విస్తరణ ఉంటుందని మరికొందరు ఆశావహుల సన్నిహితులు గట్టిగా నమ్ముతున్నారు.మరి కేటీఆర్ కు అలాగే హరీష్ కు ఎటువంటి పదవులు ఇస్తారు అనే చర్చ కూడా సాగుతోంది.