ట్రంప్ రాసలీలలు లీక్…ఇదిగో ప్రూఫ్..

688

అమెరిక అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ తాజాగా చిక్కుల్లో పడ్డారు..ఆయన అధ్యక్షుడు కాకముందు సాగించిన రాసలీలల తాలూకా సాక్ష్యమొకటి తాజాగా బయటపడింది…దీంతో ట్రంప్ పై విమర్సల పరంపర మొదలైంది…ఇటీవల ట్రంప్ తో తనకు ఎఫైర్ ఉందని..అతడితో రాసలీలలు నడిపిన ప్లే బాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ దౌగల్ ఆరోపించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే..తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె బాంబు పేల్చింది. 2006లో ట్రంప్ తనతో ఎఫైర్ కొనసాగించాడని.. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా గర్భవతిగా ఉండి బిడ్డకు జన్మనిచ్చిందని.. ఆ గ్యాప్ లో తనతో సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో తాను నోరు విప్పకుండా ఉండేందుకు డబ్బు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని కరెన్ వివరించింది…

 

ఈ వ్యవహారంపై ట్రంప్ తన మాజీ అటార్నీ జనరల్ మైకేల్ కోహెన్ తో జరిపిన సంబాషణల ఆడియో క్లిప్ లీకయింది..దీనిపై ఒక ప్రముఖ పత్రిక కధనాన్ని ప్రచురించింది.. కరెన్ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్ కుదుర్చుకోవాలని కోహెన్ కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ‘ఈ వ్యవహారం కొలిక్కి రావాలన్నా.. కరెన్ ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’ అని ట్రంప్ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్ బదులిచ్చిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అయితే ఈ ఆడియో కోహెన్ వల్లే బయటకు రావడం విశేషం.