ట్రంప్ కు మోదీ ఫోన్ పాకిస్దాన్ కు సీరియస్ వార్నింగ్

62

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలున్నాయి. రెండు దేశాలూ తమ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్ల, యుద్ధ విమానాల్నీ సరిహద్దులకు తరలిస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం జరిగేలా ఉంది. ఐతే, యుద్ధమే జరిగితే తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం తప్పదు. ఏ రకంగా చూసినా గెలిచేది భారతే. అయినప్పటికీ… పాకిస్థాన్ యుద్ధానికి సై అంటోంది. ఇదివరకు వేరు ఇఫ్పుడు వేరు, పాక్ సైనిక బలం భారత్ సైనిక బలంలో సగం మంది మాత్రమే, భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినా సహించే ప్రసక్తి లేదంటోంది. అందువల్ల యుద్ధం జరగొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. ఐతే… ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద మిలటరీ దేశం. పాకిస్థాన్ ఆరో స్థానంలో ఉంది. 2018-19లో భారత రక్షణ బడ్జెట్ రూ.2.95 లక్షల కోట్లు పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ రూ.56 వేల కోట్లే. ఏ రకంగా చూసినా పాకిస్థాన్ మనతో తలపడలేదు. ఇకకశ్మీర్ అంశంలో పాకిస్దాన్ కస్సుబుస్సులాడుతోంది, చైనా మద్దతు మినహ మరెవ్వరూ కూడా ఆ దేశానికి సపోర్ట్ అందివ్వడం లేదు.

Image result for modi and trump

ఈ సమయంలో ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్‌పై పాకిస్థాన్ విషం కక్కుతున్న అంశాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లారు ప్రధాని మోదీ. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నారని, ఇది ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. సోమవారం ట్రంప్‌కు ఫోన్ చేసిన మోదీ సుమారు అరగంట పాటు మాట్లాడారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాక భారత్-అమెరికా అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Image result for modi and trump

రెండు రోజుల కిందట ట్రంప్‌ ఇమ్రాన్‌కు ఫోన్‌ చేసిన నేపథ్యంలో తాజాగా మోదీ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. కశ్మీర్ అంశంలో తాము కలగజేసుకోలేమని అమెరికా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అంశాన్ని భారత్‌తో కలిసి ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని ఇమ్రాన్‌ఖాన్‌కు ట్రంప్ సూచించారు. దీంతో భారత్‌ను అంతర్జాతీయంగా ఇరుకున పెడదామన్న పాక్ కుట్రకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

ఈ క్రింద వీడియో చూడండి

ట్రంప్‌తో ఫోన్ సంభాషణలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికి, ఉగ్రవాదుల విధ్వంసానికి తావులేని వాతావరణనాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించారు. జూన్‌లో ఒసాకాలో జరిగిన జి-20 సదస్సులో ట్రంప్‌తో సాగించిన చర్చలను కూడా ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల నేతల సంభాషణకు సంబంధించి పీఎంవో, వైట్‌హౌస్ వేర్వేరుగా ప్రకటనలు జారీచేశాయి. ముఖ్యంగా పాకిస్ధాన్ కు మాత్రం అమెరికా సపోర్ట్ ఇఛ్చే ఆలోచనలో లేదు అని తెలుస్తోంది, యూఎన్ వోలో కూడా పాకిస్దాన్ ఒంటరి అయిన విషయం తెలిసిందే.