టీ ఆంధ్రోళ్లకు టికెట్లు..ఉత్తమ్ సంచలన ప్రకటన

469

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ లోని ఆంధ్రా వాళ్లకు రాజకీయంగా ప్రాధాన్యత లేదని ఆందోళన ఉండేది..తాజాగా తెలంగాణా పిసిసి అధ్యక్షుడు చేసిన ప్రకటన వారికి ఊరట నిచ్చేడిగా ఉంది..వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో సెటిల్ అయిన ఆంధ్రా రాయలసీమ వ్యక్తులకు టికెట్లు కేటాయిస్తామని వారికి సముచిత స్థానం కల్పిస్తామని సంచలన ప్రకటన చేసారు..హైదరాబాద్ లో అత్యంత ప్రభావం చూపే మైనార్టీలు.. ఆంధ్రా రాయలసీమ వాసులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలుకుతారని పేర్కొన్నారు. ఉత్తమ్ తాజాగా చేసిన ప్రకటనతో తెలంగాణ రాజకీయంలో వేడి పుట్టించటం కాయమని చెప్పాలి…

ఇదిలా ఉంటే.. కేసీఆర్ పై ఉత్తమ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు తన కనుసన్నల్లో జరిగినట్లుగా చెప్పేవారని.. మరి అలాంటప్పుడు విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన వర్సిటీ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారం ఉక్కు కర్మాగారం లాంటివాటిని నాలుగేళ్లు దాటినా ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణకు హైదరాబాద్ ను ఇచ్చేసి.. ఆంధ్రప్రదేశ్ కు ఏ స్టేటస్ ఇచ్చినా తమకు ఇబ్బంది లేదంటూ కేసీఆర్ నాడు చేసిన వ్యాఖ్య వాస్తవం కాదా? అని ప్రశ్నించిన ఉత్తమ్.. హైదరాబాద్ ను తెలంగాణకు చెందేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేస్తున్న బీజేపీకి కేసీఆర్ బేషరతుగా మద్దతు ఇస్తున్నారని.. మోడీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత నుంచి ప్రతి నెలా రాహుల్ టూర్ తెలంగాణలో ఉంటుందని ఉత్తమ్ చెప్పటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో రాజకీయం మరింత రసకందాయంలో పడటం ఖాయమని చెప్పక తప్పదు.