టీడీపీ లిస్టు రెడీ కూట‌మి కూర్పు లేటు?

346

తెలంగాణ‌లో ఇప్ప‌టికీ ఇంకా మ‌హాకూట‌మి సీట్ల స‌ర్దుబాటులో ఆలోచన చేస్తోంది.. ఇక టీడీపీ మాత్రం 14 సీట్ల‌కు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ సాధించుకుంది. తాజాగా పదకొండు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావు పేట- మచ్చ నాగేశ్వరరావు, వరంగల్‌ పశ్చిమ- రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, మక్తల్-కొత్తకోట దయాకర్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌- ఎర్ర శేఖర్‌, ఉప్పల్‌- వీరేందర్‌ గౌడ్‌, శేరిలింగంపల్లి- భవ్య ఆనంద్‌ ప్రసాద్‌, కూకట్‌పల్లి- పెద్దిరెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌- మండవ వెంకటేశ్వరరావుల పేర్లను టీడీపీ ఖరారు చేసినట్లు సమాచారం. ఇవే కాకుండా ఆలేరు, నకిరేకల్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నం, కోదాడ, పఠాన్‌ చెరువు, నారాయణ ఖేడ్‌లలో ఏవైనా నాలుగు స్థానాలలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Image result for congress chandrababu

కాగా టీడీపీ నుంచి అధికారికంగా అభ్యర్థు పేర్లను ప్రకటించలేదని టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ పేర్కొన్నారు. పదకొండు మంది పేర్లను ప్రకటించారడనం అసత్య ప్రచారం అని తెలిపారు. అభ్యర్థుల పూర్తి జాబితాను మంగళవారం ప్రకటిస్తామని రమణ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలంతా కలిసి ఒకే వేదికపై అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.