టీడీపీ కి గుడ్ బై చెప్పిన మరొక నేత షాక్ లో చంద్రబాబు

59

ఆంధ్రఫ్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ పార్టీ మునుపెన్నడూ కూడా లేని విధంగా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కనివిని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో దారుణంగా పరాభవం పాలైంది. ఒక రీతిన చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత ఓటమి చూసింది కాని ఈ రీతిన ఓటమిని చూడలేదు అనే చెప్పాలి… ఎప్పుడైతే ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూసిందో ఇక అప్పటినుండి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఒకవైపు ఓటమితో కృంగిపోతున్న చంద్రబాబు కి అందరు కూడా పార్టీ మారి చాలా దారుణంగా హ్యాండ్ ఇచ్చారు అనే చెప్పాలి. ఒక్కొక్కరు కూడా వరుసపెట్టి టీడీపీ అధినేతకు షాకులు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారని చెప్పొచ్చు. టీడీపీ తరపున ఎన్నికలైన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరగా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు టీడీపీ నేతలు అందరు కూడా బీజేపీలో చేరిపోయి చంద్రబాబు కి దెబ్బకొట్టారు. మరికొందరు కీలక నేతలు కూడా టీడీపీ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వ్యాపిస్తున్నాయి… ఇక వైసీపీ ఎలా ఉన్నా బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీని ఎన్నికల సమయం నుంచి టార్గెట్ చేసింది.

Image result for tdpand ycp flag

దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంది. తాజాగా చంద్రబాబుకి రాజకీయంగా ఆ పార్టీని ఏపీలో ముందుకు వెళ్లనివ్వకుండా చూడాలి అనే సంకల్పంతో ముందుకు వెళుతోంది కమలం పార్టీ..అయితే తాజాగా మరో టీడీపీ మహిళా నాయకురాలు టీడీపీ కి గుడ్ బై చెప్పింది. మాజీ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి సైతం పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతకొంత కాలంగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత ఇటీవలే బీజేపీలో చేరగా, ఇపుడు తను దివ్యవాణి ని కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని సమాచారం. దివ్యవాణి మాటిచ్చిందని కూడా బీజేపీ నేతల ద్వారా తెలుస్తుంది. కాగా ఎన్నికలకు ముందే టీడీపీలో చేరినటువంటి దివ్యవాని ఇకమీదట ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదని తెలుసుకొని, పార్టీ మీద తనకు నమ్మకం లేకనే పార్టీ మారేందుకు నిశ్చయించుకుంది సమాచారం.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే వైసీపీ పై బీజేపీ పై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి వెళ్లరు అని కొందరు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు కాని ఆమె మాత్రం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారు అని చెబుతున్నారు. వరుస పెట్టి నేతలు అందరూ టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతుండతంతో వచ్చే ఎన్నికల సమయానికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుందని రాజకీయ నేతలు చెబుతున్నమాట.