టీడీపీలోకి సీనియ‌ర్ న‌టి

374

తెలంగాణలో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది.. ఈ స‌మ‌యంలో ఏపీలో కూడా వ‌చ్చే ఆరునెలల్లో ఎన్నిక‌లు ఉన్న సంద‌ర్బంగా మ‌రింత పొలిటిక‌ల్ హీట్ అయితే క‌నిపిస్తోంది… ఏపీలో కూడా స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణలు క‌నిపిస్తున్నాయి…ఇప్ప‌టికే తెలుగుదేశం వైసీపీ జ‌న‌సేన‌లో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వారు పార్టీలు మారుతున్నారు.. టిక్కెట్ల కోసం పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఇలానే ఓ సీనియ‌ర్ న‌టి సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యారు మ‌రి ఆ వివ‌రాలు ఏమిటో తెలుసుకుందాం..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ నటి దివ్యవాణి గురువారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె చంద్రబాబును కలిశారు. ఆ త‌ర్వాత మె మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు దార్శనికత వల్ల ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబుకు చెప్పానన్నారు.. ఇక తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆమె తెలుగుదేశంలో చేరే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.. ఇటు టీడీపీ కూడా స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను ఇప్ప‌టికే సెల‌క్ట్ చేసుకుంటోంది.. ఇలా ప‌లువురు బాబుతో భేటీ అవ్వ‌డంతో పార్టీ మ‌రింత పుంజుకుంటుంది అని అంటున్నారు టీడీపీ నేత‌లు..