టీడీపీతో పొత్తుపై షబ్బీర్‌ అలీ క్లారిటీ

393

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీ గెలుపుకి దూరం అయింది కాంగ్రెస్.. అయితే వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కూడా ఇద్ద‌రు క‌లిసి వెళ‌తారా లేదా ఎవ‌రికి వారు వెళ‌తారా అనేది చూడాలి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై అధిష్టానానిదే నిర్ణయమని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని, నాలుగేళ్లుగా ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమ‌ర్శించారు.

Image result for షబ్బీర్‌ అలీ

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై టీఆర్ఎస్ ఫిర్యాదు చేయగానే స్పందించారని, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌, దామోదర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు అన్యాయమన్నారు. వేల మంది బీసీలు సర్పంచ్‌, వార్డు సభ్యులయ్యే అవకాశం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఎందుకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయలేదని షబ్బీర్ ప్రశ్నించారు. బడ్జెట్ తర్వాతే పెన్షన్‌ పెంపు అనడం ప్రజలను మోసం చేయడమేనని, లక్ష రుణమాఫీ ఏకకాలంలో చేయాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు.