టీడీపీకి ముగ్గురు గుడ్ బై బాబుకు కోలుకోలేని దెబ్బ

130

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూడటంతో వైసీపీ లేదా బీజేపీలోకి తెలుగుదేశం నేతలు క్యూ కడుతున్నారు .. ఐదు సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండటం అంటే కష్టం, పైగా తెలుగుదేశం పార్టీ పై అనేక విమర్శలు ఆరోపణలు వచ్చాయి, ఇవన్నీ తమ పీకపై చుట్టుకుంటాయి అని కొందరు నేతలు ముందుగానే వేరే పార్టీల్లోకి కర్చీఫ్ వేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ కంటే బీజేపీ ఫిరాయింపులకు తలుపులు తెరిచింది .నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిపోయారు. తాజాగా మరికొందరు అదే దారిలో ఉన్నారు. అయితే ఇద్దరు వైసీపీ వైపు చూస్తుంటే మరొకరు బీజేపీ వైపు చూస్తున్నారట. మరి ఆ నేతలు ఎవరు అంటే? వాచ్ దిస్ స్టోరీ.

Image result for jagan

విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు తనయుడు ఆనంద్‌ కుమార్‌ వైసీపీలో చేరనున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆనంద్‌ పోటీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల్లో మంచి పట్టున్న విశాఖ డెయిరీ పాలకవర్గంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఆనంద్‌ పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తులసీరావు కుమార్తె, ఎలమంచిలి మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి కూడా తన సోదరుడి బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1న విజయవాడలో జగన్‌ సమక్షంలో వీరు వైసీపీలో చేరుతున్నట్లు వర్గం వారు చర్చించుకుంటున్నారు.

Image result for tdp

విజయసాయిరెడ్డికి జిల్లాలో కుడి భుజంగా ఉంటున్న ఒక సీనియర్‌ ఆడిటర్‌ ఈ మొత్తం తంతును నడిపినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు… ఆనంద్‌ను బుజ్జగించే బాధ్యతను మాజీ మంత్రి అయ్యన్నకు అప్పగించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితం జరిగిన విశాఖ డెయిరీ బోర్డు సమావేశంలో చైర్మన్‌ తులసీరావు వెల్లడించినట్టు భోగట్టా. దీనిపై చీడికాడ ప్రాంత డైరెక్టర్‌ మినహా మిగతా 13 మంది మౌనం వహించినట్టు తెలిసింది. తమకు పార్టీ మారే ఆలోచన లేదని టీడీపీకి చెందిన కొందరు డైరెక్టర్లు చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

మరో వైపు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అభ్యర్థిగా పోటీ చేసి ఓడినన వరుపుల రాజా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీడీపీలో కాపులకు సరైన గుర్తింపు లేదని, ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ, వారి చేతుల్లోనే పార్టీ నడుస్తోందని విమర్శించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవేదన చెందుతున్నానన్నారు. కాపుల రిజర్వేషన్‌పై జగన్‌ మొదటి నుంచీ ఒకే స్టాండ్‌తో ఉన్నారని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లేదీ కేడర్‌తో సంప్రదించాకే ప్రకటిస్తానని రాజా తెలిపారు.