టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై 9న వైసీపీలోకి

151

ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో, అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్దుల ఎంపికలో నిమగ్నం అయ్యాయి, మండే ఎండలతో పాటు ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా గుంటూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖరారైంది. కొంత కాలంగా ఆయన తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా కొనసాగుతున్నారు. ఇక ఆయనకు కాకుండా వేరేఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి బాబు ఆలోచన చేయడం నరసరావు పేట నుంచి ఎంపీగా ఆయన సీటు కోరితే కాదనడంతో ఆయన టీడీపీ నుంచి విభేదించారు.

Image result for మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీడీపీలో తనకు జరిగిన అవమానాల గురించి వారికి వివరించినట్లు తెలుస్తోంది. గౌరవంలేని చోట ఉండలేనని తేల్చిచెప్పిన ఆయన… ఇప్పటి వరకు బాబు పిలుపు కోసం వేచిచూసినట్లు వివరించారు… టీడీపీ అధినేత నుంచి ఎటువంటి కబురు లేకపోవడంతో… ఆయన ఎమ్మెల్యే పదవికి అలాగే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల 9న ఆయన వైసీపీలో చేరుతారు అని తెలుస్తోంది.