టీడీపీకి మరోషాక్

176

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వేళ షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.మాజీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కాగా 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన ఆయన.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం టికెట్ను కొత్తపల్లి ఆశించారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన మంగళవారం మధ్యాహ్నం కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే అనుచరులు, కుటుంబీకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సుబ్బరాయుడు మీడియాకు తెలిపారు. ఇక నరసాపురం టికెట్ కొత్తపల్లికి కాకుండా బండారు మాధవనాయుడికి కేటాయించారు చంద్రబాబు. దీంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారట.