టీఆర్ఎస్ – మ‌హాకూట‌మికి ఇది స్వీట్ న్యూస్

356

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీటు కొన‌సాగుతోంది.. ఏడ‌వ తేదిన డిసెంబ‌ర్ నెల‌లో ఎటువంటి ఫ‌లితాలు ఫ్ర‌జ‌లు ఇవ్వ‌నున్నారో అనేది ప్ర‌తీ ఒక్క‌రూ ఆలోచిస్తున్నారు.. ఇక డిసెంబ‌ర్ 7న పోలింగ్,11న ఫ‌లితాలు వ‌స్తాయి దీంతో తెలంగాణ‌లో 11 డిసెంబ‌ర్ న తుదిఫ‌లితాలు వ‌చ్చి తెలంగాణ పీఠం ఎవ‌రికి ద‌క్కుతుంది అనేది తేలిపోనుంది. ఇక ఎన్నిక‌ల హోరా హోరి ప్ర‌చార ప‌ర్వానికి వ‌స్తే.

Related image

తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత స్క్రూటినీలో సుమారు 500 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇంకా అధికారికంగా ఎంతమంది ఎన్నికల బరిలో ఉన్నది అధికారులు ప్రకటించాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో స్వతంత్ర, కూటమిలోనీ రెబల్స్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనున్నది. డిసెంబర్‌ 7న పోలింగ్ జరుగుతుంది. అలాగే 11న ఫలితాలు వెలువడుతాయి. దీంతో పార్టీలు మ‌రింత ప్ర‌చారంలో దూసుకుపోవాలి అని చూస్తున్నాయి. ఇటు మ‌హాకూట‌మి అటు అధికార పార్టీ ప్ర‌చారాలు భారీ బ‌హిరంగ‌స‌భ‌ల‌తో ఈ 15 రోజులు రాజ‌కీయం మ‌రింత హీట్ ఎక్క‌నుంది.