జ‌న‌సేన‌- వైసీపీ కుమ్మ‌క్కు- చంద్ర‌బాబు

395

ఏపీకి అంద‌రూ మోసం చేశారు అని, ప్ర‌త్యేక హోదా ఇస్తాము అని చెప్పిన మోదీ ఏపీకి ఎటువంటి సాయం చేయ‌లేదు అని, ఇక్క‌డ విభ‌జ‌న గాయం పై కారం పూసేందుకు మోదీ వ‌స్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు…మోదీ సభలకు హాజరుకాకుండా గుణపాఠం చెప్పాలని టీడీపీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన పిలుపునిచ్చారు. జనవరి 1న బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని సీఎం ఆదేశించారు.

Image result for janasena ycp

కేవలం పార్టీ కార్యక్రమానికి రావడమే మోదీ రాజకీయమని మండిపడ్డారు. మోదీ పర్యటనపై జగన్‌, పవన్‌ ఎందుకు నోరు తెరవరని ప్రశ్నించారు. వైసీపీ, జనసేన ఎందుకు నిరసనలు చేయడం లేదని అన్నారు. రేపు కడప స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వీరి రాజ‌కీయాలు ప్ర‌జ‌లు గుర్తిస్తున్నారు అని వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన వైసీపీకి ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతారు అని విమ‌ర్శించారు.