జ‌గ‌న్ మీ తండ్రి మాట‌నిల‌బెట్టాలి అంటే ఈ ప‌ని చెయ్ ?

466

ఈ మాట అంది ఎవ‌రు అని అనుకుంటున్నారా ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి.. ఇంత‌కి ఎందుకు ఈ వ్యాఖ్య ఏమిటి ఈ విష‌యం అని అనుకుంటున్నారా. అస‌లు విష‌యానికి వ‌ద్దాం. అనంత‌పురం జిల్లాలో ఓ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు.

Image result for న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి..అనంతపురం-తాడిపత్రి రహదార్ల కూడలిలో ఏర్పాటుచేసిన ఇందిర, రాజీవ్‌ విగ్రహాలను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో కిరణ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను ఆసరాగా చేసుకుని పరపతి పెంచుకోవడానికి బీజేపీ పాకులాడుతోందన్నారు. గొడ్డు మాంసం పేరు చెప్పి ప్రజలను ఆ పార్టీవారు హతమార్చారన్నారు. దేశాన్ని కుల, మతాలకతీతంగా సమానంగా చూడగలిగింది ఒక్క కాంగ్రెస్సేనన్నారు. దేశరాజకీయాలు రెండు పక్షాలుగా చీలాయని, రాష్ట్రంలోని వైసీపీ, జనసేన పార్టీలు తామే పక్షమో వెల్లడించాలన్నారు. చంద్రబాబునాయుడు తెలివైనవాడని, దేశం సుస్థిరంగా ఉండాలంటే కాంగ్రెస్‌ వల్లే సాధ్యమనే నిజాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన చివరి రోజుల్లో ఓ సభలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీని పీఎంగా చూడాలనేది తన చిరకాల స్వప్నమని పేర్కొన్నారని గుర్తు చేశారు.

Related imageతండ్రి మాట నిలపాలనుకుంటే జగన్‌ ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోవాల్సిన ఘడియలు ఆసన్నమయ్యాయన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో హామీల ప్రమాణ పత్రంతో ప్రజల వద్దకు వెళుతుంటే తమకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై తొలి సంతకం చేస్తారన్నారు. అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తారన్నారు. అస్తవ్యస్తంగా మారిన జీఎస్టీ విధానాన్ని సరళీకృతం చేస్తారన్నారు. పేదల మేలు కోరే కాంగ్రెస్‌ పార్టీ అమ్మ ఒడిలాంటిదని అభివర్ణించారు. హోదా ఆంధ్రుల హక్కని నినదించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఆయ‌న పిలుపునిచ్చారు.