జ‌గ‌న్ పై దాడి కేసులో కీలక సాక్ష్యం

379

విశాఖ‌లో వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ పై జ‌రిగిన కత్తి దాడిఘ‌ట‌న‌లో పోలీసులు ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.. సీపీ మహేష్‌చంద్ర లడ్డా వివరణ ఇచ్చారు. పబ్లిసిటీ కోసమే జగన్‌పై దాడి చేసేందుకు యత్నించాడని సీపీ మహేష్‌ చంద్ర లడ్డా పేర్కొన్నారు. జగన్‌ను హత్య చేయాలని దాడి చేయలేదని, కేసులో ఇప్పటి వరకు 92 మందిని విచారించామని సీపీ లడ్డా వెల్లడించారు.

Image result for jagan attack

మొదట అక్టోబర్‌ 18న జగన్‌పై దాడికి ప్లాన్ చేశాడని, అక్టోబర్‌ 25న పక్కా ప్లాన్‌ ప్రకారం దాడి చేశాడని సీపీ లడ్డా స్పష్టం చేశారు. శ్రీనివాస్ నుంచి 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ లడ్డా తెలిపారు. జగన్‌కు హాని జరగొద్దని దాడికి ముందు… శ్రీనివాస్‌ కత్తిని 2 సార్లు ఉడకబెట్టాడని సీపీ లడ్డా చెప్పారు. జగన్‌ చొక్కా, కత్తి, ల్యాబ్‌ రిపోర్ట్‌లు అందాయని, శ్రీనివాసరావు హ్యాండ్‌ రైటింగ్‌ రిపోర్టులు అందాయని సీపీ లడ్డా అన్నారు.