జ‌గ‌న్ పాద‌యాత్ర పై తుల‌సిరెడ్డి స‌టైర్లు – విసుర్లు

397

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర పై కాంగ్రెస్ టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికే ప‌లు స‌టైర్లు వేస్తున్నారు, వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న పాదయాత్ర వల్ల ఏపీకి ఏం ఒరిగిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. పాదయాత్ర ద్వారా కేంద్రం నుంచి చట్టప్రకారం రావాల్సినవి ఏమైనా జగన్ సాధించగలిగారా? అని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌కు లేదన్నారు. పాదయాత్ర అంటే రోజూ రూ. 2 కోట్ల ఖర్చు, నెత్తిమీద ముద్దులు, సెల్ఫీలు అని తులసీ రెడ్డి సెటైర్లు వేశారు.

Image result for jagan padayatraరాష్ట్రానికి ఇప్పటి వరకు.., రాబోయే రోజుల్లో ఒణగూరిన ప్రమోజనం ఏంటి? అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జగన్‌ను, వైసీపీ నేతలను ప్రశ్నిస్తోందని తులసీ రెడ్డి అన్నారు. జగన్ పాదయాత్ర వలన ప్రత్యేక హోదా వస్తుందా?, కేంద్రం నుంచి రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రావాల్సిన రూ. 12వేల కోట్లు వచ్చాయా? విభజన చట్టంలో సెక్షన్ 46, సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 23,300 కోట్లు ఇచ్చాయా? వస్తుందా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయా? రాజధానికి నిధులు అదనంగా వస్తాయా? ఏపీకి రావాల్సినవి ఏమైనా సరే జగన్ పాద్రయాత్ర వల్ల వస్తాయా? అని తులసీ రెడ్డి జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.. ఇలాంటి విష‌యాల‌లో కేంద్రాన్నిజ‌గ‌న్ ప్ర‌శ్నిస్తే మంచిది అని ఆయ‌న విమ‌ర్శించారు.