జ‌గ‌న్ నాకు టికెట్ ఇచ్చారు వైసీపీ ఇంచార్జ్ ప్ర‌క‌ట‌న

373

ప్రకాశం జిల్లాలో వైసీపీ త‌న దూకుడు చూపిస్తోంది అని చెప్పాలి.. ఇక్క‌డ అద్దంకి నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు అనే విష‌యంలో చాలా రోజులుగా అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి.. వచ్చే ఎన్నికలలో అద్దంకి నుంచి వైసీపీ తరపున పోటీ చేసేది నేనేనని, ఈ విషయాన్ని జగన్‌ స్పష్టంగా చెప్పారని మాజీ ఎమ్మెల్యే, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన చెంచు గరటయ్య అన్నారు

Image result for చెంచు గరటయ్య
నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా స్థానిక శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గరటయ్య మాట్లాడారు. ముందుగా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలతో ర్యాలీగా అద్దంకి చేరుకున్నారు.జ‌గ‌న్ నాకు టికెట్ అని చెప్పారు అని క‌చ్చితంగా ఇక్క‌డ వైసీపీ జెండా ఎగుర‌వేస్తాను అని తెలియ‌చేశారు.. డాక్టర్‌ గరటయ్య మాట్లాడుతూ నవరత్నాలను వైసీపీ ప్రవేశపెట్టిందని, రానున్న ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలందరు సహకరించాలని డాక్టర్‌ గరటయ్య కోరారు.. రాష్ట్రాన్ని జ‌గ‌న్ ఎంతో అభివృద్ది ప‌థంలో ముందుకు తీసుకువెళతారు అని తెలియ‌చేశాడు.