జ‌గ‌న్ కే సీఎం పీఠం తేల్చేసిన నేష‌న‌ల్ స‌ర్వే

512

ఏపీలో నేష‌న‌ల్ మీడియా తాజాగా విడుద‌ల చేసిన జ‌నం ప‌ల్స్ జ‌గ‌న్ కు జైకొట్టేలా వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార మార్పిడి క‌చ్చితంగా జ‌రుగుతుంది అని జ‌నాలు తెలియ‌చేశారు.. ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో, ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు.

Image result for jagan

ఈ స‌ర్వేతో ఏపీలో జ‌గ‌న్ కు మ‌రింత ప్ర‌జాధ‌ర‌ణ ఉంటుంది అనేది తేలింది. ఈనెల 8 నుంచి 12 తేదీల‌లో ఐదురోజుల పాటు జ‌నం ప‌ల్స్ తీసుకున్నారు మొత్తానికి.. 10650 మంది నుంచి ప్రజాభిప్రాయం తీసుకున్నారు పలు ప్ర‌శ్న‌లు సంధించి వాటి వివ‌రాల ప్ర‌కారం ప్ర‌జా మ‌ద్ద‌తు ఎవ‌రికి ఉంది అనేది తెలియ‌చేశారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు, 43% మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని వారు వెల్లడించారు.

36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరు బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ కీరోల్ పోషిస్తుంది అని తెలియ‌చేశారు.. ఇక జ‌న‌సేన‌పై కూడా ప్ర‌జల‌కు 5 శాతం మాత్ర‌మే న‌మ్మ‌కం ఉంది అని తేల్చింది ఈ స‌ర్వే… ఇక తెలుగుదేశం పార్టీ పై వ్య‌తిరేక‌త ఎంత పెద్ద ఎత్తున ఉందో బ‌య‌ట‌ప‌డింది. ఇక ప్ర‌ధానిగా ఏపీ నుంచి రాహుల్ కు 44 శాతం మ‌ద్ద‌తు ఉంటే మోడీకి 33 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తు వ‌చ్చింది.