జ‌గ‌న్ కి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ ?

397

వైయ‌స్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్మొహ‌న్ రెడ్డికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇటీవ‌ల వార్ జ‌రుగుతూనే ఉంది.. రాజ‌కీయంగా ఇరువురు విమ‌ర్శ‌లు చేసుకుంటూనే ఉన్నారు.. తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ గుర్తించనంత మాత్రాన గుర్తింపు లేనట్టు కాదన్నారు. ఒక్క పిలుపుతో లక్షల మంది కవాతులో పాల్గొన్నారని గుర్తు చేశారు. త‌మ పార్టీ ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలుసు అని ఆయ‌న అన్నారు.

Image result for pawan kalyan

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీని తాము గుర్తించడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీకి వైసీపీ గుర్తింపు అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు. జగన్ అసెంబ్లీకి వెళ్లరు.. ప్రజాసమస్యలను పట్టించుకోరన్నారు. అనంతపురం జిల్లా గురించి మాట్లాడుతూ జిల్లాలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. రైతులు, చేనేతలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

Image result for jagan

రాయ‌ల‌సీమ‌లో ముఖ్యంగా అనంత‌పురం జిల్లాలో ఉపాధిలేక రాయలసీమ యువత వలసపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు నిర్మూలనకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళికలు చేయాలన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించే పంటలను యువత పండించాలని సూచించారు. వాస్తవాలను దాచి ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో పోటీ చేయాలని అన్ని జిల్లాల నుంచి అడుగుతున్నారని.. తాను ఎక్కడి నుంచి పోటీచేస్తానో.. జనవరి, ఫిబ్రవరిలోగా తెలియజేస్తానన్నారు పవన్.