జ‌గ‌న్ ఆరోగ్య సూత్రాలు ఇవే

442

వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి మూడు వేల కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేసినా, ఆయ‌న‌లో ఎటువంటి శ‌రీర‌మార్పు క‌ల‌గ‌లేదు. ఒకే విధంగా ఆయ‌న ఉన్నారు… ఇక పాద‌యాత్ర‌లో ఆయ‌న ఎటువంటి డైట్ ఫాలో అవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా.. ఉదయం మాత్రం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు. గంట పాటు వ్యాయామం.. కాలకృత్యాలనంతరం ఆరున్నర.. ఏడు గంటల వరకు పత్రికా పఠనం. ఆ తర్వాత ముఖ్యులతో ఫోన్‌ సంభాషణ. అనంతరం ఉదయం ఏడు.. ఏడున్నర గంటలకు పార్టీ ప్రముఖులు, ఇతర ముఖ్యులతో భేటీ.

Image result for jagan padayatra

ఆ తర్వాత ఆ రోజు సాగే పాదయాత్ర మార్గాన్ని, ఏ గంటకు ఎక్కడ ఉండాలన్నది అడిగి తెలుసుకుంటారు. షెడ్యూల్‌ ప్రకారం పాదయాత్రను ప్రారంభించడంలో ఆయనకు ఆయనే సాటి.ఉదయం అల్పాహారం లేకుండా కేవలం గ్లాస్‌ జ్యూస్‌ తాగి జగన్‌ తన యాత్రను ప్రారంభిస్తారు. రాత్రి ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమించినా.. ఉదయం ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికల్లా టెంట్‌ నుంచి బయటకొస్తారు. రోజూ తెల్లటి చొక్కా, క్రీమ్‌ కలర్‌ ఫ్యాంట్, కాళ్లకు బూట్లు ఇవే ఆయన ఆహార్యం. మధ్యాహ్నం ఆయన కేవలం కొన్ని పండ్లు, కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.

Image result for jagan padayatra

రాత్రి పూట ఆహారాన్ని కేవలం ఒకటీ రెండు పుల్కాలు, పప్పు, మరో కూరతో ముగిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు కప్పు పాలు తాగుతారు. ఇప్పటి వరకూ ఇదే ఆయన దినచర్య. మితాహారం, అధిక వ్యాయామంతోనే ఆయన రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు.ఇక మూడు వేల కీలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర పూర్తి అయింది.. ఆయ‌న వెంట ఉన్న నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. జ‌గ‌న్ లో ఎటువంటి మార్పు రాలేద‌ని, ఆయ‌న ఫిట్ నెస్ సీక్రెట్ ఏమిటా అని చ‌ర్చించుకుంటున్నారు అది వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆరోగ్య ర‌హ‌స్యం.