జ‌గ్గారెడ్డికి బెయిల్

400

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు స‌రికొత్త అల‌జ‌డి మొదలైంది.. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ముందు ఎటువంటి వైరంగా ఉన్నా, ఇప్పుడు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డి తెలంగాణ‌లో పోటీకి దిగుతున్నాయి.. ఈ స‌మ‌యంలో తెలంగాణ‌లో ఏ పార్టీపై టార్గెట్ అవుతుంది అని అంద‌రూ అనుకుంటున్నారు. ఇక మఖ్యంగా కాంగ్రెస్ నాయ‌కుడు జ‌గ్గారెడ్డి మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసులో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే.

Image result for జ‌గ్గారెడ్డి

ఇక ఆయ‌న‌కు తాజాగా బెయిల్ మంజూరు అయింది.. మానవ అక్రమ రవాణా కేసులో ఆయనకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ ఇచ్చింది.. ఈరోజు చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలకానున్నారు..2004లో నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గుజరాత్ కి చెందిన ముగ్గురుని తన కుటుంబ సభ్యులుగా చేర్చి అమెరికాకి తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈకేసులో ఆయ‌న్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Image result for జ‌గ్గారెడ్డి

ఇది తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ‌గా క‌నిపించింది. ఇక ఎన్నిక‌ల హీట్ ఉన్న స‌మ‌యంలో ఇది పార్టీకి మ‌రింత నెగిటీవ్ అవుతుంది అని అంద‌రూ భావించారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు బెయిల్ రావ‌డంతో వారి కుటుంబం కూడా కాస్త ఆనందం వ్య‌క్తంచేసింది. ఇటు జ‌గ్గారెడ్డి కేడ‌ర్ కూడా ఆనందంలో ఉన్నారు .