జూనియర్ మామకు జగన్ కీలక పదవి

62

ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో నాయకుల చేరికలతో పార్టీలు కళకళలాడుతున్నాయి.. యుఖ్యంగా రాజకీయంగా పదవులు ఎలా ఉన్నా కొందరు మాత్రం పార్టీలో సీట్లకోసం టిక్కెట్ల కోసం పార్టీలు జంప్ చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి.. అలాగే రాజకీయంగా ముందే తమకు సీటును ప్రకటించాలి అని చెబుతున్నారు పార్టీలో చేరే ముందు. ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ లో ఇలాంటి పరిస్దితి రాజకీయంగా కనిపిస్తోంది.

Image result for నార్నె శ్రీనివాసరావుఇక జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ తీర్దం పుచ్చుకోవడం తెలిసిందే గత కొద్ది రోజులుగా ఆయన వైసీపీలో చేరుతారు అని వార్తలు వచ్చాయి.. చివరకు ఆయన వైసీపీలో చేరారు ..అయితే ఈ సమయంలో నార్నె ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అందరూ అనుకున్నారు. కాని ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడా పోటీ చేయడం లేదు అని తెలుస్తోంది.. ఇక ఈ సమయంలో ఆయనకు కీలక పదవి పార్టీ నుంచి వచ్చింది అని చెప్పాలి.

Image result for నార్నె శ్రీనివాసరావు

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత ఆదేశాల మేరకు జూనియర్ మామకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యునిగా నియమించడం జరిగింది. ఈ మేరకు ఆదివారం రాత్రి వైసీపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. జూనియర్ మామ ఫిబ్రవరి 28న వైసీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే.. తెలుగుదేశం పార్టీనుంచి వైసీపీలోకి వచ్చిన నేతలకు జగన్ మంచిగా కండువా కప్పి పార్టీలో తీసుకోవడమే కాదు పార్టీలో సముచితస్ధానం ఇస్తున్నారు అని అంటున్నారు పార్టీ శ్రేణులు.